పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సింగరేణి సమస్యలపై లేవనెత్తారు పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రిటైర్డ్ పెన్షనర్స్ సమస్యలపై మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలని పార్లమెంట్‌లో గడ్డం వంశీ గళమెత్తారు.
కాక వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్న సమయంలో రిటైర్డ్ పెన్షనర్స్ స్కీం ను తీసుకొచ్చారు. స్కీం ప్రారంభం నుంచి ఉన్న పెన్షనే ప్రస్తుతం సింగరేణిలో వస్తుంది.. దశాబ్దాలు అవుతున్నా పెన్షన్ సవరణ జరుగలేదు.. రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలని పార్లమెంట్‌లో గడ్డం వంశీ గళమెత్తారు. గతంలో సింగరేణి యాజమాన్యం పెన్షనర్లనిధికి రూ.140కోట్లు కేటాయించింది..అయితే ఇప్పటికీ అమలు కావడం లేదని అన్నారు.
గత పార్టమెంట్ వేసవి కాల సమావేశాల్లో సింగరేణి కార్మికుల పించణ్ పెంపు చేస్తామని హామి ఇచ్చారు. చాలీచాలని పింఛన్‌తో బతుకులీడుస్తున్న సింగరేణి కార్మికుల్లో పింఛన్ పెంపుపై ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ పెరిగే విధంగా సింగరేణి సంస్థ టన్ను బొగ్గు ఉత్పత్తిపై 20 రూపాయల చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్టు బోర్డుకు జమ చేస్తామని ప్రకటించింది. యేటా 140 కోట్ల రూపాయలు జమ కానుండనగా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ .
►ALSO READ | రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ దాడులు..
కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్టు బోర్డు నిధితో పదవీ విరమణ పొందే సింగరేణి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పింఛన్ పెరిగే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా ఇచ్చే వేతనాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ కింద పే స్కేల్‌ను బట్టి జమ చేస్తుంటారు. పదవీ విరమణ అనంతరం జమ చేసిన పీఎఫ్‌తోపాటు ఆ ఉద్యోగికి వేతనంలో సగం సొమ్ము పింఛన్ కింద అందజేస్తారు. పీఆర్సీ పెరిగినప్పుడు, డీఏలు పెరిగిన సమయంలో కూడా పింఛన్‌దారులకు పెన్షన్ పెరుగుతుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
సింగరేణి సంస్థలో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు నెలనెలా ఇచ్చే వేతనంలో మూల వేతనాన్ని అనుసరించి ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్నారు. వారు పీఎఫ్ కింద ఎంత సొమ్ము చెల్లిస్తారో, అంతే మొత్తంలో సంస్థ కూడా జమ చేస్తుంది. కార్మికులు పదవీ విరమణ పొందిన అనంతరం ప్రావిడెంట్ ఫండ్ అందజేస్తూ వచ్చారు. ఆ తర్వాత వారికి సింగరేణి సంస్థ నుంచి ఎలాంటి పింఛన్లు ఇచ్చే వారు కాదు. పదవీ విరమణ పొందిన అనంతరం సింగరేణి కార్మికులకు పింఛన్ వర్తింపజేయాలని కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి 1995 నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. బొగ్గు గనుల్లో పని చేస్తున్న కార్మికులు, ఇతర ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్స్ స్కీమ్‌ను వర్తింపజేయాలని 1998లో పార్లమెంట్‌లో చట్టం తీసుకువచ్చారు.
