
చండీగఢ్: రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల చదువుల కోసం అందిస్తానని ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ప్రకటించారు. ‘‘రాజ్యసభ సభ్యుడిగా.. నేను నా జీతాన్ని రైతుల కుమార్తెల చదువులకు, వారి సంక్షేమానికి ఇవ్వాలనుకుంటున్నాను. మన దేశ అభివృద్ధికి నా చేతనైనంత సాయం చేస్తాను’’అని శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత నెలలో ఆప్ తరఫున పంజాబ్ నుంచి హర్బజన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.