రాజకీయ శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం

రాజకీయ శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం

రోశయ్య గారి మరణం.. తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయామని ఆయన అన్నారు. 

‘రోశయ్య ఒక ఆర్థిక నిపుణుడు, అద్భుత మేధావి. నేను శాశనసభ చూడాలి అనుకున్నపుడు రోశయ్యనే ఫస్ట్ చూశాను. రామారావు, రోశయ్య చాలా సన్నిహితంగా ఉండేవారు. నేను విద్యార్థి దశ నుంచే వారినుంచి ఎంతో నేర్చుకున్నాను. నేను రోశయ్య 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీలో కలిసి పని చేశాం. నేను బీజేపీ పక్ష నేతగా ఉన్నపుడు ఆయన శాశనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. రాజకీయ శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం. అసెంబ్లీ లోపల, బయట వైఎస్ కు రోశయ్య కవచంలా ఉండేవారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడు కూడా మాకు చాలా సమయం ఇచ్చేవారు. వారి కుటుంబంతో మాకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే నేను వేరే ఫ్లైట్ లో అర్జెంటుగా వచ్చాను. చాలా బాధ అనిపిస్తుంది. రోశయ్య ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యం కలిగించాలని కోరుకుంటున్నాను’ అని కిషన్ రెడ్డి అన్నారు.