పేద విద్యార్థినికి ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సాయం

 పేద విద్యార్థినికి ఎంపీ కోమటిరెడ్డి ఆర్థిక సాయం

చదువుకు పేదరికం అడ్డు రాకూడదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ జిల్లాలో పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు. మెడికల్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని పద్మశ్రీకి 75 వేల  ఆర్థికసాయం చేశారు.  పద్మశ్రీ చదువుకు సహకరిస్తానని హామీ  ఇచ్చారు. నల్లగొండ జిల్లాలోని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. జాతీయ రహదారి 565 నిర్మాణంలో  షాపులు పోయేవారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక TRS లీడర్లు షాపు యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు కోమటి రెడ్డి.