
- దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
వికారాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, నీటి సరఫరా, వ్యవసాయం, బ్యాంకింగ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పశు సంవర్ధక శాఖ, మిషన్ భగీరథ, నేషనల్ హైవే, గృహ నిర్మాణ శాఖ, మార్కెటింగ్, అటవీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు బ్యాంకర్లు అన్ని రంగాలకు విరివిగా రుణాలివ్వాలన్నారు. గ్రామీణాభివృద్ధి క్రింద జిల్లాలో 1,86 ,179 లక్షల జాబ్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. 1.60 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్పథకం కింద రూ.490 కోట్లు వారి అకౌంట్లలో వేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీఏ శ్రీనివాస్, దిశ కమిటీ సభ్యులు అంతారం లలిత, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, వడ్ల నందు, జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉంది
సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తలాప్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతికూల వార్తలే కాకుండా సానుకూల వార్తలతోనూ సమాజాంలో మార్పు తీసుకురావొచ్చని చెప్పారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి తదితరులు పాల్గొన్నారు.