హైదరాబాద్‌‌లోని కేంద్ర ప్రభుత్వ భూముల్ని రక్షించండి:ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్‌‌లోని కేంద్ర ప్రభుత్వ భూముల్ని రక్షించండి:ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూములను రక్షించాలని ఎంపీ లక్ష్మణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభలో స్పెషల్ మెన్షన్ కింద తెలంగాణలోని హెచ్ఎంటీ, ఐడీపీఎల్ భూముల రక్షణ అంశాన్ని లేవనెత్తారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూములు ఉన్నాయని చెప్పారు.

కుత్బుల్లాపూర్‌‌‌‌లో 69 ఏండ్ల క్రితం 880 ఎకరాల్లో హెచ్ఎంటీ క్యాంపస్‌‌ను స్థాపించారని, ఇందులో 20 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. స్థలం ఎక్కువగా ఉందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం 120 ఎకరాలను వెనక్కి తీసుకుందన్నారు. అలాగే, 891 ఎకరాల 38 గుంటల్లో ఐడీపీఎల్ ఉందని, ఇందులో దాదాపు 200 ఎకరాలను జీపీఏ పేరుతో కొందరు ఆక్రమించుకున్నారన్నారు. భూములను ఆయా శాఖలు కాపాడాలని కోరారు.