కేసీఆర్ కుటుంబ మాత్రమే రాజకీయంగా ఎదుగుతుంది : లక్ష్మణ్

కేసీఆర్ కుటుంబ మాత్రమే రాజకీయంగా ఎదుగుతుంది : లక్ష్మణ్

కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్  ఆరోపించారు . నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. నిరుద్యోగ భృతి ఏమైందని లక్ష్మణ్  ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నారు. బీఆర్ఎస్ కు మహిళలంటే చిన్న చూపన్న లక్ష్మణ్ ... కేసీఅర్  ఫస్ట్ క్యాబినేట్ లో మహిళ మంత్రినే లేదన్నారు. గవర్నర్ ను సైతం ఎన్నో అవమానాలు చేశారని ఆరోపించారు.  ప్రధాని మోడీ మహిళలకుసముచిత స్థానం కల్పించారని లక్ష్మణ్ చెప్పారు. అన్ని రంగాల్లో వారికి సమానమైన అవకాశాలను కల్పిస్తున్నారని ప్రశంసించారు. బడ్జెట్ సమావేశాలలను చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాలన్నారు. మన తెలుగు ఆడపడుచు ఈ అమృత్ కాల్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిందని లక్ష్మణ్ చెప్పారు.