రాహుల్ గాంధీ సామాజిక విప్లవాన్ని తెస్తున్నరు : ఎంపీ మల్లు రవి

రాహుల్ గాంధీ సామాజిక విప్లవాన్ని తెస్తున్నరు : ఎంపీ మల్లు రవి
  • కులగణనను అందరూ అభినందిస్తున్నరు: ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కార్ల్‌‌ మార్క్స్ ఆర్థిక విప్లవాన్ని తీసుకొస్తే.. దేశంలో లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సామాజిక విప్లవాన్ని తెస్తున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేసిన బీసీ కుల గణనను.. ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ మోడల్‌‌ను అనుసరిస్తామని దేశం మొత్తం చెప్తోందన్నారు. 

సన్నం బియ్యం ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, కావాలంటే కేటీఆర్ ఏ గ్రామానికైనా వెళ్లి చెక్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ కేబినేట్‌‌లో బీసీ మంత్రులు ఎంత మంది ఉన్నారని అడుగుతున్న నేతలు.. బీఆర్ఎస్ హయాంలో ఎంత మంది మహిళలకు, దళితులకు పదవులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.