బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు నిరసన సెగ తాకింది. మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనిర్శిటీలో తమ సమస్యలపై జర్నలిజం విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులకు సర్ది చెప్పేందుకు ప్రజ్ఞా సింగ్ అక్కడకు వెళ్లారు. NSUI కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా ఉగ్రవాది వెనక్కి వెళ్లిపో అంటూ నినాదాలు చేశారు. దీంతో NSUI కార్యకర్తలతో బీజేపీ మద్దతుదారులు వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని …విద్యార్థులను అక్కడి నుంచి పంపించేశారు. తనను ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజ్ఞా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.

