ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్.. రాహుల్కు మద్ధతుగా ప్రియాంక గాంధీ విన్నూత ప్రచారం

ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్.. రాహుల్కు మద్ధతుగా ప్రియాంక గాంధీ విన్నూత ప్రచారం

అటు అన్న రాహుల్ గాంధీ.. ఇటు చెల్లి ప్రియాంక గాంధీ.. ఓట్ చోరీ అంశంపై వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఓట్ చోరీ జరిగిందని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయటపెట్టే ప్రయత్నం చేయగా.. అన్నకు మద్ధతుగా చెల్లెలు ప్రియాంక మరో కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఓట్ చోరీ సిగ్నేచర్.. అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్రియాంక.. దేశ ప్రజలంతా ఈ ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రారంభించిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంతకాల ప్రచారంలో అందరూ పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రియాంక.

ప్రతీ ఓటు కౌంట్ అవుతుంది.. ప్రతి సంతకం కౌంట్ అవుతుంది.. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య రక్షణ కోసం.. రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం నిలబడాలని వీడియో సందేశాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

మేము ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించుకునేందుకు మేము కొట్లాడుతున్నాం.. అందరూ ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రియాంక.