మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఇవ్వాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య 

మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఇవ్వాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో రాష్ట్ర బీసీ స్వరాజ్య సేవా సమితి అధ్యక్షుడిగా వంగురి శ్రీనివాస్ యాదవ్​ను నియమిస్తూ ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీలకు సముచిత స్థానం దక్కినప్పుడే ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ డిమాండ్​పై దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.