టీచర్, గ్రూప్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

టీచర్, గ్రూప్స్ పోస్టులకు  నోటిఫికేషన్ ఇవ్వాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగ రంగాల్లో  బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజును ఎంపీ ఆర్.కృష్ణయ్య సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిశారు. ఉన్నత ఉద్యోగాల్లో బీసీ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారు. శుక్రవారం బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేశ్ యాదవ్ నేతృత్వంలో వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి కృష్ణయ్య చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. 

అనంతరం మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్ ఇతర ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఎయిడెడ్, కస్తూర్బా ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 34 వేల టీచర్, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు.