- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ఆమనగల్లు, వెలుగు : తెలంగాణ బీసీల రక్షణకు చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీలు అన్యాయాలకు, దాడులకు, అవమానాలకు గురవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం మాదిరిగానే బీసీలకు చట్టం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆదివారం కడ్తాల్ లో యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఏసీలో బీసీ రక్షణకు చట్టం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారని, ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు, చట్టసభల్లో 50% రిజర్వేషన్లకు, ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, ఖాళీ పోస్టుల భర్తీకి కృషి చేసి బీసీలకు న్యాయం చేసి గౌరవం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. మన పార్టీని ఆదరించాలని కోరారు. ఐక్యవేదిక కన్వీనర్ రాఘవేందర్ , వార్డు సభ్యులు వసంత, పుల్లమ్మ, బీసీ నేతలు పాల్గొన్నారు.
