
శ్రీశైలం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీకి లేక రాసిన ఆయన.. ప్రమాద సంకేతాలపై సిబ్బంది లేఖ రాసినా ఉన్నతాధికారులు టైంకు స్పందించ లేదన్నారు .శ్రీశైలం డ్యాం భద్రత, విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ అభ్యంతరాలు, ఆందోళనలను కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు .ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తొమ్మిది మంది ప్రాణలతో పాటు, వేల కోట్ల జాతి సంపద దగ్ధమైందన్నారు .దీనిపై నిస్పాక్షింగా విచారణ జరగాలన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని.. బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మోడీని కోరారు రేవంత్.
see more news
ఒకే రోజు 61,408 కేసులు..57,468 మంది డిశ్చార్జ్