పార్లమెంట్ అంటే నోటీస్ బోర్డు కాదు: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

పార్లమెంట్ అంటే నోటీస్ బోర్డు కాదు: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఆరోపణలు, నీట్ యూజీ పేపర్ లీక్ వంటి కీలకమైన అంశాలపై పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. పార్లమెంట్ అంటే కేవలం బిల్లులను ప్రకటించి, ఆమోదించుకునే ‘నోటీస్ బోర్డు’ కాదని విమర్శించారు. ప్రజాసమస్యలపై ఎంపీలు తమ వాయిస్‌‌ను వినిపించేందుకు పార్లమెంట్ ఒక వేదిక అని పేర్కొన్నారు. 

పార్లమెంట్ స్ట్రీట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకారులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారనే కారణంతో భద్రతా దళాలు వారిపై లాఠీచార్జ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అయోధ్య చందా చోరీ, నీట్ పరీక్ష పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌‌లో అన్ని వర్గాల అభిప్రాయాలు వినాలని, సుదీర్ఘంగా చర్చించాలని సూచించారు.