
వరంగల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని ఖండించారు అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు,మాజీ మంత్రి డీకే అరుణ. పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడి కేసీఆర్ రాక్షస పాలనను తలపిస్తోందని మండిపడ్డారు.
ఎంపీ స్థాయి నాయకుడికే రక్షణ కల్పించలేని పోలీసులు… దాడిని ముందుండి చేయించడం అమానుష చర్య అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి భూకబ్జాలకు మారుపేరుగా మారారని దీనిపై ఎంపీ అరవింద్ ప్రశ్నిస్తే దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ ఎమ్మెల్యేలు నరేందర్, వినయ భాస్కర్ లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.