
హైదరాబాద్: ఎస్సీ నేషనల్ కో ఆర్డినేటర్స్ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 45 మంది పేర్లతో కూడిన కో ఆర్డినేటర్స్ జాబితాను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం (అక్టోబర్ 21) ఎస్సీ కో ఆర్డినేటర్స్ జాబితాను విడుదల చేశారు. ఈ ఎస్సీ కో ఆర్డినేటర్స్ జాబితాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు చోటు కల్పించింది ఏఐసీసీ.