
- సీజ్ ఫైర్ కి ఒప్పుకోవడంలో మతలబేంటి?
- అమాయకుల ప్రాణాలతో బీజేపీ రాజకీయాలు
ఢిల్లీ: పార్లమెంట్లో రెండు గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని ప్రసంగంలో స్పష్టత లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృ ష్ణ ఆరోపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ప్రయాంకగాంధీపహల్గాం ఉగ్రదాడిపై లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక పోయారని విమర్శిం చారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విర మణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఖండించలేదన్నారు.
ఆయన సీజ్ ఫైర్ కు ఒప్పకోవడంలోని మతలబు ఏమిటని ప్ర శ్నించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న దైర్యంలో సగం కూడా ప్రస్తుత ప్రధానికి లేదన్నారు. ఆయన నేతృత్వంలో దేశం సురక్షితంగా లేదని పహల్గాం ఘటనతో రుజువు అయిందన్నారు. పహల్గాం ఉగ్రదా డిలో మరణించిన 26 మంది పర్యాటకుల ప్రాణాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.