మోదీ.. నంబర్ వన్ దేశద్రోహి.. పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రశ్నిస్తే విద్యార్థులను టెర్రరిస్టుల్లా చూస్తారా?: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మోదీ.. నంబర్ వన్ దేశద్రోహి.. పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రశ్నిస్తే విద్యార్థులను టెర్రరిస్టుల్లా చూస్తారా?: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయండి
  • నీట్ వివాదంపై మోదీకి భయం పట్టుకుంది
  • అందుకే అర్ధరాత్రి సమయంలో సెల్ఫీ వీడియోలు పెడుతున్నారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో నంబర్ వన్ దేశద్రోహి అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటే, విద్యార్థులను టెర్రరిస్టుల కన్నా హీనంగా కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని పలు యూనివర్సిటీలకు కేంద్రం లేఖలు రాయడాన్ని ఖండించారు. 

ఈ అంశంపై శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. నీట్ వివాదంపై పరిస్థితి చేయి దాటిందని మోదీ భయపడుతున్నారని, అందుకే అర్ధరాత్రి ఎవరో రాసిచ్చిన పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెల్ఫీ వీడియోలు చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని ఎద్దేవా చేశారు. ‘‘పిల్లలు లేని ప్రధాని మోదీకి పిల్లల తల్లిదండ్రుల బాధ, ఆ పిల్లలు పడుతోన్న వేదన ఎలా అర్థమవుతుంది. కేంద్ర సర్కార్ విద్యార్థులను టెర్రరిస్టుల్లా చూస్తోంది. రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా కేంద్రం సర్కారు సాగుతోంది. 

ప్రభుత్వాన్ని నడపడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారు’’ అని ఆయన విమర్శించారు. విద్యార్థులపై జరుపుతున్న దాడిని వెంటనే విరమించుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో మోదీకి ఈ విద్యార్థులే తమ బలాన్ని చూపిస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని, ప్రధాని మోదీ.. దేశ యువత, ప్రజల మద్దతును కోల్పోయారని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మకర ద్వారం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. 

తాను చేసే పనులన్నీ దేశ ప్రయోజనాల కోసమేనని మోదీ చెబుతున్నప్పటికీ, వాస్తవానికి అవన్నీ అధికారం కోసమేనని విమర్శించారు. ‘‘ఉద్యోగాలు, గౌరవం, మర్యాద కావాలని దేశ యువత కోరుకుంటున్నారు. పేపర్ లీక్, విద్యా వ్యవస్థను నాశనం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో మోదీ విఫలమవుతున్నారు’’ అని ఆయన ఫైర్ అయ్యారు.

కేటీఆర్ అంకుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాపీ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే.. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ సెటైరికల్ బర్త్ డే విషెస్ తెలిపారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ... ఈ 50వ బర్త్ డే రోజు కనీసం 50 మంది యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో ఒక వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ‘‘కేటీఆర్ అంకుల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు పదేండ్లపాటు మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. 

ఈ 50వ జన్మదినం సందర్భంగా కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే చాలెంజ్ విసురుతున్నాను. అదే మీ జన్మదినం సందర్భంగా సమాజానికి అందించే ఉత్తమ బహుమతి అవుతుంది’’ అని అన్నారు. అలాగే గతంలో గ్లోబరీనా సంస్థ, పేపర్ లీకేజీలతో నష్టపోయిన బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి అండగా నిలవాలని కేటీఆర్ అంకుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.