పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలి: ప్రధాని మోదీ

పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలి: ప్రధాని మోదీ

పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.  సభలో ఫలవంతమైన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఇవాళ (జులై 20) పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్ష పార్టీలు సహకరించాలని మీడియా ముఖంగా కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని తెలిపారు. నెల రోజులుగా భారత్ అనేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. వర్షం, వర్షాకాల సమావేశాలు రెండూ ఒకేసారి వచ్చాయి.. రెండూ ఒకేసారి వస్తేమంచి ఫలితాలు ఉంటాయని అన్నారు.

రాష్ట్రీయ, జాతీయ అంతరిక్ష రంగాల్లో గర్వించదగ్గ క్షణాలు ఉన్నట్లు కొనియాడారు. మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయింది.. రాజస్థాన్ లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ దేశానికి అంకితం చేసినట్లు చెప్పారు.  ఒక సెమీ కండక్టర్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ జాతికి అంకితం చేశారు. 

 దేశంలో తొలిసారి హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలును అందుబాటులోకి తెచ్చాం.. స్కైరూట్‌ అంతరిక్షంలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపించింది.. 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించారు అని కొనియాడారు.  యువత సాహసాలు చేయడమే కాదు.. విజయం సాధిస్తున్నారు.. అంతరిక్షంలో నవశకం ప్రారంభమైంది.. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం వచ్చిందన్నారు.  వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు.