T20 World Cup: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు ముందు అభిమానులను ఉత్సాహపరిచే ప్రత్యేక దృశ్యం కనిపించింది. భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ కలిసి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకువచ్చారు. వారిద్దరూ రాకను స్టేడియంలో ఉన్న అభిమానులను ఎంతో ఉత్సాహానికి గురి చేసింది. ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాలు కలిసి ట్రోఫీతో మైదానంలోకి రావడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఘనంగా స్వాగతించారు.
అయితే ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ విజేతలుగా భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ నాయకత్వంలోని టీమిండియా టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇక రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఇండియన్ టీమ్ ఇటీవల టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకుని డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచింది. దీంతో ఈ ఇద్దరు విజయవంతమైన కెప్టెన్లు కలిసి ట్రోఫీని స్టేడియంలోకి తీసుకురావడం అభిమానులకు ప్రత్యేక క్షణంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ దృశ్యం క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
కాగా, ఈ హైవోల్టెజ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ట్రోఫీ కోసం తీవ్రంగా పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేయగా.. గత మ్యాచ్‌లో ఆడిన మెక్‌కాంచి స్థానంలో డఫీకి అవకాశం కల్పించింది. మరోవైపు భారత్ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఇద్దరు ఫ్లాప్ స్టార్స్ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తుది జట్టులో మరోసారి టీమిండియా మేనేజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతాడని ప్రచారం జరిగినప్పటికీ.. ఫైనల్ కాబట్టి మిస్టరీ స్పిన్నర్ పైనే కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ నమ్మకం ఉంచారు.
MS DHONI AND ROHIT SHARMA BRINGING THE T20I WORLD CUP 2026 🔥🇮🇳pic.twitter.com/fQBYTY14qV
— PRATHAM_18 (@unclekohli) March 8, 2026
