
ఐపీఎల్ 2023 కోసం ఎంఎస్ ధోని సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా నెట్స్లో ధోని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలోనే ఓడిపోవడంతో..ఈ సారి ఎలాగైనా తన జట్టును ఛాంపియన్ ను చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేడియంలో ధోని నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ధోని భారీ సిక్స్‌లు కొడుతున్నాడు. దీంతో ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ధోని ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
2022 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో కేవలం నాలుగు మ్యాచుల్లో గెలిచి 9వ స్థానంలో నిలిచింది. అయితే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కానుందని సమాచారం. గతేడాదే ధోని ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ అవుతాడని అనుకున్నారు. కానీ సొంత గ్రౌండ్ చెన్నైలో రిటైర్ అవ్వాలన్న కోరికను ధోని బయటపెట్టాడు.