IPL 2025: ఐపీఎల్ నుంచి గైక్వాడ్ ఔట్.. చెన్నై కెప్టెన్‌గా ధోనీ!

IPL 2025: ఐపీఎల్ నుంచి గైక్వాడ్ ఔట్..  చెన్నై కెప్టెన్‌గా ధోనీ!

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడని.. మిగిలిన సీజన్‌కు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్  కన్ఫర్మ్ చేశారు. "కెప్టెన్సీ విషయంలో మా జట్టుకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఎవరినీ లక్ష్యంగా పెట్టుకోలేదు. ధోని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు". అని ఫ్లెమింగ్ అన్నారు.

సీజన్ ప్రారంభంలో గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  గైక్వాడ్ కుడి మోచేతికి గాయం అయింది. గైక్వాడ్ మోచేయి ఎముక విరిగినట్టు సమాచారం. దీంతో శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోయే మ్యాచ్ తో ధోనీ కెప్టెన్సీ ప్రారంభమవుతుంది. ధోనీ చివరిసారిగా ఐపీఎల్ 2023 ఫైనల్ కు కెప్టెన్‌గా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్లో ధోనీ సారధ్యంలో చెన్నై టైటిల్ గెలుచుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రుడు..అప్పటి నుంచి ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతాగున్నాడు. 

Also Read : రేపటి నుంచే పాకిస్థాన్ సూపర్ లీగ్

ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమవుతుంది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒకటి మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అసలే పరాజయాల్లో ఉన్న చెన్నైకు గైక్వాడ్ కు గాయం పెద్ద సమస్యగా మారింది. చెన్నై తమ తదుపరి మ్యాచ్ శుక్రవారం (ఏప్రిల్ 11)  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది.