ధోనీ, రోహిత్‌.. ఐపీఎల్‌ గ్రేటెస్ట్‌ కెప్టెన్స్

ధోనీ, రోహిత్‌.. ఐపీఎల్‌ గ్రేటెస్ట్‌ కెప్టెన్స్

ముంబై:  ఇండియన్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌లో మోస్ట్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌, ముంబై ఇండియన్స్‌‌‌‌. ఫస్ట్‌‌‌‌ నుంచి చెన్నై కెప్టెన్‌‌‌‌గా ఉన్న ధోనీ ఆ టీమ్‌‌‌‌ను అద్భుతంగా నడిపిస్తుండగా.. 2013లో ముంబై సారథ్యం అందుకున్న రోహిత్‌‌‌‌ జట్టును నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్‌‌‌‌ మొదలై శనివారానికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో ఏప్రిల్‌‌‌‌ 18వ తేదీన ఈ లీగ్‌‌‌‌ మొదలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాడ్‌‌‌‌కాస్టర్‌‌‌‌ స్టార్ స్పోర్ట్స్‌‌‌‌.. ధోనీ, రోహిత్‌‌‌‌ను ఐపీఎల్‌‌‌‌ గ్రేటెస్ట్‌‌‌‌ కెప్టెన్లుగా ఎంపికచేసింది. యాభై మంది ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌తో కూడిన  జ్యూరీ  ఈ ఇద్దరినీ సెలెక్ట్​ చేసింది. ఈ జ్యూరీలో 20 మంది మాజీ క్రికెటర్లు, పది మంది సీనియర్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ జర్నలిస్టులు, మరో పది మంది స్టాటిస్టిషన్స్‌‌‌‌ ఉన్నారు. ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌  గ్రేట్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌  కేటగిరీలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌‌‌‌ ఏబీ డివిలియర్స్‌‌‌‌కు ఓటు వేసిన జ్యూరీ.. బౌలింగ్‌‌‌‌లో శ్రీలంక పేసర్‌‌‌‌ లసిత్‌‌‌‌ మలింగకు పట్టం కట్టింది. చెన్నైకి ఆడుతున్న ఆసీస్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ షేన్‌‌‌‌ వాట్సన్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా నిలిచాడు. చెన్నై కోచ్ స్టీఫెన్‌‌‌‌ ఫ్లెమింగ్‌‌‌‌ ఉత్తమ కోచ్‌‌‌‌గా ఎంపికయ్యాడు. లీగ్‌‌‌‌ టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌ అయిన ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ గ్రేటెస్ట్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా నిలిచాడు.

నిస్సందేహంగా ధోనీనే:  పీటర్సన్‌‌‌‌

టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ మహేంద్ర ధోనీపై ఇంగ్లండ్‌‌‌‌ మాజీ క్రికెటర్‌‌‌‌ కెవిన్‌‌‌‌  పీటర్సన్‌‌‌‌  ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియాకు రెండు వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లు అందించిన ధోనీనే నిస్సందేహంగా గ్రేటెస్ట్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అని కొనియాడాడు. ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా వాదించడం కష్టమని అన్నాడు.  ఇక, వెస్టిండీస్‌‌‌‌ స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ ఆండ్రీ రసెల్‌‌‌‌ను ముందుగానే తమ జట్టులోకి తీసుకొస్తే కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌లో మరిన్ని టైటిల్స్‌‌‌‌ నెగ్గేదని ఆ జట్టు మాజీ కెప్టెన్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ అన్నాడు. కేకేఆర్‌‌‌‌కు తాను ఆడిన ఏడేళ్ల పాటు రసెల్‌‌‌‌ ఉండి ఉంటే తాము కనీసం మరోటి లేదా రెండు ట్రోఫీలు అయినా గెలిచే వాళ్లమన్నాడు.