రాష్ట్ర పథకాలపై కెనడా కాన్సుల్ జనరల్ ప్రశంసలు

రాష్ట్ర పథకాలపై కెనడా కాన్సుల్ జనరల్ ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ రంగ పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసలు గుప్పించారు కెనడా కాన్సుల్ జనరల్ నికోలే గిరార్డ్. ఇవాళ కేటీఆర్ తో సమావేశమైన ఆమెకు.. తెలంగాణలో పారదర్శక పారిశ్రామిక విధానాల గూరించి వివరించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ఆమె అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గతంలో మాదిరే తమ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని, పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగ ప్రగతి కోసం వినూత్నమైన ప్రణాళికలను, పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు కేటీఆకం. కెనడా, ఇండియాకి సంబంధించిన వ్యాపార వాణిజ్య సహకారానికి సంబంధించచి చర్చించారు.

రాష్ట్రాలతో డైరెక్టుగా కెనడా ప్రభుత్వం, ఇక్కడి రాష్ట్రాలతో చర్చల చేస్తే వాణిజ్య సంబంధాలు మరింత దృఢ పడతాయని అభిప్రాయపడ్డారు KTR. పెట్టుబడులకు తెలంగాణలో అనుకూల వాతావరణం గురించి కెనడా కాన్సుల్ జనరల్ కు తెలిపారు KTR. భేటీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో వ్యాపార వాణిజ్యలకు సంబంధించిన అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. కెనడా పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతదని తెలిపారు కేటీఆర్.