జైపూర్: గవర్నర్ తేనేటి విందుకు సర్పంచ్కు ఆహ్వానం

జైపూర్: గవర్నర్ తేనేటి విందుకు సర్పంచ్కు ఆహ్వానం

జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికి అరుదైన అవకాశం లభించింది. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో తేనేటి విందులో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం లోకభవన్​లో ‘ఎట్ హోం’ తేనీటి విందులో పాల్గొనాలని రవికి ఆహ్వానం అందింది. 

ఇంకుడుగుంతల నిర్మాణం, జల సంరక్షణలో ముదిగంట ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈ ఏడాది మార్చి 29న మన్ ​కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ గ్రామాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సర్పంచ్​కి గవర్నర్ నుంచి ఆహ్వానం లభించింది.