ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం

ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం

ముంబై: రిలయన్స్​ పగ్గాలను తర్వాత తరాలకు అప్పచెప్పడానికి రెడీ అవుతున్నట్లు చైర్మన్​ ముకేశ్​ అంబానీ వెల్లడించారు. రిలయన్స్​ ఫ్యామిలీ డే సందర్భంగా వర్చువల్​ కాన్ఫరెన్స్​లో మంగళవారం ముకేశ్​ అంబానీ మాట్లాడారు. తనతో సహా గ్రూప్​లోని  సీనియర్లందరూ యంగ్​ లీడర్​షిప్​కు అధికార బదలాయింపునకు సిద్ధపడాల్సిందేనని అన్నారు. ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యువతరాన్ని గైడ్​ చేస్తూ, ఎంకరేజ్​ చేసే బాధ్యత మాత్రమే అట్టేపెట్టుకుని, వారు పెర్​ఫార్మ్​ చేస్తుంటే చూసి మెచ్చుకోవాలని పేర్కొన్నారు. లీడర్లను మించిపోయేలా ఆర్గనైజేషనల్​ కల్చర్​ను రిలయన్స్​లో తీర్చిదిద్దాలని ​అంబానీ తెలిపారు. తన పిల్లలు ఆకాశ్​, ఇషా, అనంత్​లు రిలయన్స్​ను మరింత ఎత్తుకు తీసుకెళ్తారనే నమ్మకాన్ని ముకేశ్​ అంబానీ ప్రకటించారు. తన తండ్రిలో కనిపించిన సామర్ధ్యం ఇప్పుడు తన పిల్లలలో కనిపిస్తోందని, రిలయన్స్​ను మరింత సక్సెస్​ఫుల్​గా చేసే వారి మిషన్​కు ఆల్​ ది బెస్ట్​ చెబుతున్నానని అన్నారు. గతంలో సాధించిన దానితో ఎప్పుడూ సంతృప్తి పడిపోకూడదని పేర్కొన్నారు.