
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచనాల కోసం తనపై మీడియా, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ లో ఏవేవో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లోకి, బీజేపీలోకి వెళ్తున్నానని ఏదేదో ప్రచారం చేస్తున్నారు.. దయచేసి ఇలాంటి తంబ్ నెయిల్ పెట్టి మీ లైక్స్ , వ్యూస్ కోసం నాయకుడి క్రెడిబిలిటి దెబ్బతీయొద్దని సూచించారు. ఏదైనా ఉంటే తనను అడిగి రాయాలని సూచించారు. ఇలాంటివి మానుకోకపోతే వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
2 లక్షల ఉద్యోగాలేవి?
నిరుద్యోగ యువతి, యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ పోస్టులు పెంచాలని అడిగిన కాంగ్రెస్ .. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని అన్నారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు.