OMG : కాలేజీ హాస్టల్ భోజనంలో పాము ముక్కలు..

OMG : కాలేజీ హాస్టల్ భోజనంలో పాము ముక్కలు..

ఇటీవల కాలంలో ఐస్ క్రీమ్ లో మనిషి వేలు రావడం చూశాం. ఈ సంఘటన అందరిని కలవరపెట్టింది.. ఆన్ లైన్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన వ్యక్తి డెలివరీ ఐటెం చూ సి షాక్ తిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. అయితే దాదాపుగా ఇలాంటిదే మరో సంఘటన బిహార్ లో జరిగింది. కాకపోతే ఇది ఆర్డ్ ర్ చేసిన భోజనంకాదు..ఓ ఇంజినీరింగ్ కాలేజీలోని హాస్టల్ మెస్ లో విద్యార్థులకు పెట్టే భోజనంలో కనిపించిన దానిని చూసి విద్యార్థులు షాక్ తిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

బీహార్ లోని బంకా లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్ధులకు వడ్డించినభోజనంలో చనిపోయిన పాము ముక్కలు కనిపించారు. ఈ భోజనం తిన్న 11 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వాంతులు , విరోచనాలతో బాధపడుతుండగా చికిత్స కోసం వారిని ఆస్పత్రికి  తరలించారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. 

విద్యార్థులకు పెట్టిన అన్నంలో పాము ముక్కలు ఉన్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఘటన తర్వాత కాలేజీ యాజమాన్యం మెస్ కు ఆహారం సప్లయ్ చేస్తున్న కాంట్రాక్టరును తొలగించారు. నిందితుడికి జరిమానా కూడా విధించారు. దీంతోపాటు ప్రిన్సిపాల్ తోపాటు టీచర్లు కూడా ప్రతిరోజు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని తప్పనిసరి చేసింది. 

గతవారం ముంబైలో ఓ డాక్టర్ తన చెల్లెలికోసం ఐస్ క్రీమ్ ను ఓ గ్రాసరీ డెలివరీ యాప్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. . అందులో మనిషి వేలు కనిపించడంతో షాకయ్యాడు.. ముంబైలోని మలాద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

ఇలాంటిదే మరో సంఘటన కూడా నోయిడాలో కూడా జరిగింది. నోయిడాకు చెందిన ఓ మహిళ  పదినిమిషాల్లో ఆర్డర్ ను డిలివరీ చేసే బ్లెంక్ ఇట్ గ్రాసరీ డెలివరీ యాప్ లో ఈ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. యితే ఆ ఐస్ క్రీమ్ లో సెంటిపెడ్ వచ్చినట్లు తెలిపింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో X లో వైరల్ కావడంతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పై ఆందోళన లేవనెత్తింది.