ఏసీబీకి చిక్కిన నల్గొండ జిల్లా నాంపల్లి ఆర్ఐ. ‎‎రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

ఏసీబీకి చిక్కిన  నల్గొండ జిల్లా నాంపల్లి ఆర్ఐ. ‎‎రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

నాంపల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్  ఆఫీస్​లో ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా, రెవెన్యూ ఇన్​స్పెక్టర్  గోపరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమికి సంబంధించిన పంచానామా రిపోర్ట్​ను తహసీల్దార్​కు అందజేసేందుకు ఆర్ఐ లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం ఏవో సూచన మేరకు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వ్యక్తి అదుల్ల యాదగిరికి డబ్బులు అందజేయగా, నల్గొండ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. యాదగిరి వద్ద రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ గోపరాజుతో పాటు యాదగిరిని అరెస్ట్​ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.