కోల్‌బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని జడ్పీ గర్ల్స్స్కూల్విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను కాంగ్రెస్లీడర్లు పంపిణీ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి జ్ఞాపకార్థం కాంగ్రెస్ టౌన్ జనరల్సెక్రటరీ బత్తుల వేణు ఆధ్వర్యంలో సోమవారం బ్యాగులు, వాటర్ బాటిల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా స్పోక్స్ పర్సన్ అబ్దుల్అజీజ్, మున్సిపల్ కౌన్సిలర్లు పుల్లూరి తిరుమల కల్యాణ్, ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ, లీడర్లు డి.రమేశ్, బి.మల్లేశ్, నర్స శ్రీనివాస్, కె.రామస్వామి, సంగ తిరుపతి, రవీందర్, సాంసాయి తదితరులు పాల్గొన్నారు.
