జగిత్యాల జిల్లా కోరుట్లలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ

జగిత్యాల జిల్లా కోరుట్లలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ

కోరుట్ల, వెలుగు: చార్జింగ్​పెట్టిన ఎలక్ట్రిక్​స్కూటీ భారీ శబ్దంతో పేలిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాయిరాంపురా కాలనీకి చెందిన నిమిషకవి లక్ష్మీనారాయణ తన ఇంటి ఆవరణలో ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్​పెట్టాడు. కొద్దిసేపటికే స్కూటీ నుంచి ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చి మంటలు చెలరేగింది. వాహనదారుడు మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే పూర్తిగా దగ్ధమైంది.