టీఎంసీ పేరు వివాదంపై 3 నెలల్లో నిర్ణయం తీస్కోండి: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

టీఎంసీ పేరు వివాదంపై 3 నెలల్లో నిర్ణయం తీస్కోండి: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బెంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోని రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న పార్టీ పేరు, గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరు, పూలు-గడ్డి గుర్తు ఎవరికి చెందాలన్న విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు కాలపరిమితిని కూడా ఖరారు చేసింది. 

పార్టీ పేరు, ఎన్నికల గుర్తు రెండు వర్గాల్లో ఎవరూ ఉపయోగించకూడదన్న ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్​పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌‌మాల్య బాగ్చి, వి.మోహనతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. టీఎంసీ పేరు, గుర్తుపై ఉన్న వివాదానికి సంబంధించి ఎన్నికల సంఘం ముందు ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది.