రైలు ప్రమాదం : రెడ్ సిగ్నల్ ఉన్నా.. పట్టించుకోకుండా వెళ్లిన డ్రైవర్

రైలు ప్రమాదం : రెడ్ సిగ్నల్ ఉన్నా.. పట్టించుకోకుండా వెళ్లిన డ్రైవర్

 పశ్చిమ బెంగాలో రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. లోకోపైలట్ తో సహా 15 మంది మృతి చెందారు. 60 మంది వరకు గాయాలయ్యాయి. జూన్ 17న ఉదయం 9 గంటలకు కాంచనజంగా ఎక్స్ ప్రెస్ (13174) ని వెనుక నుంచి ఢీ కొట్టింది గూడ్స్ రైలు. ఈ ప్రమాదంలో కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు కోచ్ లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

త్రిపుర రాజధాని అగర్తల నుంచి పశ్చిమ బెంగాల్ లో ని సీల్డాకు కాంచనజంగా ఎక్స్ ప్రెస్ వెళ్తోంది. రెడ్ సిగ్నల్ కారణగా సిలిగురిలోని రంగపాణి స్టేషన్  సమీపంలోని రుయిదాసా దగ్గర ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు.  ఇంతలోనే  వెనుక నుంచి అదే ట్రాక్ పై వచ్చిన గూడ్స్ రైలు  కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టింది.  గూడ్స్ రైలు లోకో పైలట్ సిగ్నల్పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 

మరో వైపు  రైలు ప్రమాదంపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.  మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ..  గాయపడ్డ వారికి రూ.,50 వేలు ప్రకటించారు. 

మృతుల కుటుంబాలకు మెరుగైన ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైనవారికి రూ.2.5 లక్షలు, గాయాలైనవారికి రూ. 50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు.