
- ఆగిపోయిన బోర్డింగ్, చెక్ ఇన్ సౌకర్యాలు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విమానాశ్రయంలో బోర్డింగ్, చెక్ ఇన్ లు మొ త్తం ఆగిపోయాయి. ప్రయాణికులు ఉన్న T3 టెర్మినల్ లో 15 నిమిషాల పాటు చీకటిమయమైంది. ఈ అనుకోని కరెంట్ కట్ తో ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కరెంట్ ను పునరుద్దరించేందుకు ఎయిర్ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది.
అనుకోని కరెంట్ కట్ తో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా xలో తమ ప్రస్టేషన్ ను తెలిపారు. ఎయిర్ పోర్టులో పవర్ కట్ సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఏం జరిగిందో తెలియక తికమక పడ్డారు..కొందరైతే భయంతో వణికిపోయారు. ఎయిర్ పోర్టులో కరెంట్ పోవడం ఏంటీ ..ఏదైనా ప్రమాదం జరి గిందా అని ఆందోళన చెందారు. టెర్మినల్ 3లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళానికి దారి తీసిందంటూ రాశారు. అయితే విద్యుత్ నిలిచిపోవడానికి గల కారణాలు ఇంకా తెలిసి రాలేదు.
@AAI_Official @DelhiAirport
— Sudhanshu Shanker Singh (@SudhanshuShan10) June 17, 2024
No light on T3 terminal since 15 minutes. Can not buy water, coffee, any necessary eatables. Is this what we pay for? Can someone look into it? pic.twitter.com/VpwDsqQz55