హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో ‘ముకుందా జ్యువెలర్స్’ 9వ బ్రాంబ్ను ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సంస్థ ఎండీ నరసింహారెడ్డి, డైరెక్టర్లు నికితా రెడ్డి, కృష్ణలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని పొంది 9వ బ్రాంబ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు.
డైరెక్టర్ నికితా రెడ్డి మాట్లాడుతూ.. మూడేండ్ల వ్యవధిలోనే 9 బ్రాంచ్లు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఓపెనింగ్ సందర్భంగా ఎటువంటి మేకింగ్, మజూరీ ఛార్జీలు లేకుండా ఆభరణాలు అందిస్తున్నామని, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 8 వరకు వీఏపై ఫ్లాట్ 10 శాతం ఆఫర్ ఉంటుందని ఆమె వెల్లడించారు.
