భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కీ.శే.ఏ.కే.విశ్వనాథ్‌రెడ్డి ఆలోచన వేల మంది రైతులకు వరంగా మారిందని ఆ సంఘ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్‌రెడ్డి అన్నారు. సోమవారం విశ్వనాథ్‌రెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆవరణలో ఆయన ఫొటోకు సంఘ అధ్యక్షుడు సీనియర్ సభ్యులు రఘునాయకుల బాల్ రెడ్డి, దొంగల అయిలయ్యతో కలిసి నివాళులర్పించారు.
అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘ అభివృద్ధికి విశ్వనాథ్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జీఎం ఎం.రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు గజ్జి వీరయ్య, కార్యవర్గ సభ్యులు మూగయ్య, రవీందర్ రెడ్డి, రాములు, కనుకమ్మ, బుచ్చయ్య, బాషు, వీరారెడ్డి, శ్రీనివాస్, మహేందర్, కుమారస్వామి, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, కాశిరెడ్డి వసంత తదితరులు పాల్గొన్నారు.
