
ఉస్తాద్ రామ్(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా..శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిన్న(ఆగస్టు 26) శనివారం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగాంగా బ్యూటీ శ్రీలీల(Sreeleela) తనలోని మరో టాలెంట్ ను చూపించారు.
స్కంద మూవీలో.. నీ చుట్టూ..చుట్టూ చుట్టూ తిరిగిన సాంగ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్లో క్యూట్గా పాడి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు శ్రీలీల పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధమాఖా మూవీతో తనలోని వర్సాటాలిటీని ప్రూవ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలోని బడా ప్రాజెక్ట్స్ అన్నిటిని తన ఖాతాలో వేసుకుంది. ఇన్నాళ్లు డాన్స్, యాక్టింగ్తో ప్రేక్షకులను కట్టిపడేసిన శ్రీలీల..ఇప్పుడు ఏకంగా లైవ్లో సాంగ్ పాడి ఫ్యాన్స్ను మెప్పించింది. ఇక శ్రీలీల టాలెంట్ చూసి మల్టీటాలెంటెడ్..గ్రేట్ ఫ్యూచర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. శ్రీలీల ఈ సాంగ్ పాడే ముందు మాట్లాడిన మాటలతో కూడా..క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫిదా చేసింది.
స్కంద మూవీలో ఫస్ట్ టైం హీరో రామ్కు జోడీగా నటించిన శ్రీలీల..గండరభాయ్ లిరికల్ సాంగ్కి శ్రీలీల వేసిన స్టెప్స్ ఊరమాస్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, సాంగ్స్కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న స్కంద మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.