ములుగు ఎమ్మెల్యే సీతక్కపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. శనివారం సోషల్ మీడియా టీంతో జరిగిన జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఎమ్మెల్యే సీతక్క చాలా కష్టపడుతున్నారని, ప్రతి పార్టీ ప్రోగ్రాం పాటిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటూ ప్రస్తావించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీలో సీతక్క లాంటి ఎమ్మెల్యే ఉండడం గర్వకారణమని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.
