బెంగళూరుపై ముంబై ఘన విజయం

బెంగళూరుపై ముంబై ఘన విజయం

టాప్ ప్లేస్ మరింత పదిలం చేసుకున్న ముంబై

ఆల్ రౌండ్ షో తో బెంగళూరుకు చెక్

లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడిన ముంబై ఇండియన్స్‌‌.. ఐపీఎల్‌‌–13లో దాదాపుగా ప్లే ఆఫ్స్‌‌ బెర్త్‌‌ను ఖరారు చేసుకుంది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (43 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌‌) చెలరేగడంతో.. కీలక మ్యాచ్‌‌లో బెంగళూరుకు చెక్‌‌ పెట్టి.. టేబుల్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌ను మరింత పదిలం చేసుకుంది..! మరోవైపు దేవదత్‌‌ పడిక్కల్‌‌ (45 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 74) రాణించినా బౌలర్లు వికెట్ల వేటలో వెనుకబడటంతో.. ఆర్‌‌సీబీకి ఓటమి తప్పలేదు..! అయితే మరో రెండు మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉన్న కోహ్లీసేన.. టాప్‌‌ ప్లేస్‌‌కు వస్తుందో లేదో చూడాలి..!!

అబుదాబి: అరబ్‌‌ గడ్డపై ముంబై ఇండియన్స్‌‌ అదరగొడుతున్నది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగుతూ.. బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 5 వికెట్ల తేడాతో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుపై గెలిచింది. టాస్‌‌ గెలిచిన ముంబై ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 రన్స్‌‌ చేసింది. పడిక్కల్‌‌తో పాటు జోష్‌‌ ఫిలిప్పీ (24 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33) రాణించాడు. తర్వాత ముంబై 19.1 ఓవర్‌‌లో 5 వికెట్లకు 166 రన్స్‌‌ చేసింది. సిరాజ్‌‌ (2/28), చహల్‌‌ (2/37) చెరో రెండు వికెట్లు తీసినా ముంబై గెలుపును అడ్డుకోలేకపోయారు. సూర్యకుమార్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

ఆరంభం అదుర్స్‌‌..

ఓపెనర్ల మార్పుతో పడిక్కల్‌‌తో కలిసి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఫిలిప్పీ.. బెంగళూరుకు మెరుగైన ఆరంభాన్నిచ్చాడు. తొలి రెండు ఓవర్లలో చెరో ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చారు. థర్డ్‌‌ ఓవర్‌‌లో పడిక్కల్‌‌.. వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, తర్వాతి ఓవర్‌‌లో ఇద్దరు కలిసి బౌండ్రీలు దాటించారు. అయితే బౌల్ట్‌‌ వేసిన ఐదో ఓవర్‌‌లో ఫిలిప్పీ..  సూపర్‌‌ సిక్సర్‌‌తో పాటు ఫోర్‌‌తో 10 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌లో పడిక్కల్‌‌.. రెండు ఫోర్లతో 12 రన్స్‌‌ రాబట్టడంతో పవర్‌‌ప్లే ముగిసేసరికి 54 రన్స్‌‌ వచ్చాయి. 8వ ఓవర్‌‌లో చహర్‌‌ (1/43) వచ్చి రావడంతో పిలిప్పీని ఔట్‌‌ చేసి ముంబైకి బ్రేక్‌‌ ఇచ్చాడు. అప్పటికి ఆర్‌‌సీబీ స్కోరు 71/1. భారీ అంచనాల మధ్య వచ్చిన కోహ్లీ (9) నిరాశపర్చాడు. కానీ రెండో ఎండ్‌‌లో పడిక్కల్‌‌ మాత్రం బౌండ్రీలతో దూకుడు కొనసాగించాడు. ఫస్ట్‌‌ టెన్‌‌లో బెంగళూరు 88/1 స్కోరు చేయగా, పడిక్కల్‌‌ 30 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. 12వ ఓవర్‌‌లో ఆర్‌‌సీబీకి మరో షాక్‌‌ తగిలింది. బుమ్రా వేసిన బాల్‌‌ను కోహ్లీ గాల్లోకి లేపగా మిడ్‌‌ వికెట్‌‌లో తివారి అందుకున్నాడు. బుమ్రాకు ఇది వందో వికెట్‌‌ కావడం విశేషం. రెండో వికెట్‌‌కు 24 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. చహర్‌‌ కొద్దిగా రన్స్‌‌ కట్టడి చేసినా.. 13వ ఓవర్‌‌లో ఆర్‌‌సీబీ స్కోరు 100కు చేరింది. 14 వ ఓవర్‌‌లో డివిలియర్స్‌‌(15)  గేర్‌‌ మార్చి 6, 4 బాదడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో పడిక్కల్‌‌ 6, 4, 4తో 16 పరుగులు పిండుకోవడంతో 15 ఓవర్లలో  బెంగళూరు129/2కు చేరింది.

బుమ్రా డబుల్‌‌ వికెట్‌‌ మెయిడెన్‌‌..

డివిలియర్స్‌‌ క్రీజులో ఉండటం వల్ల స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో భారీ షాట్స్‌‌ను ఆశించారు. కానీ పొలార్డ్‌‌ (1/5) దెబ్బకు 16వ ఓవర్‌‌ రెండో బాల్‌‌కే ఏబీ పెవిలియన్‌‌కు చేరాడు. ఇక17వ ఓవర్‌‌లో బుమ్రా డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. మూడు బాల్స్‌‌ తేడాలో దూబే (2), పడిక్కల్‌‌ను ఔట్‌‌ చేసి ‘డబుల్‌‌ వికెట్‌‌ మెయిడెన్‌‌’ ఓవర్‌‌ వేశాడు. తర్వాతి ఓవర్‌‌లో మోరిస్‌‌ (4) ఓ ఫోర్‌‌ కొట్టి ఔటయ్యాడు. 131/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న ఆర్‌‌సీబీ.. జస్ట్‌‌ 7 రన్స్‌‌ తేడాతో 4 వికెట్లు కోల్పోవడంతో స్కోరు 138/6గా మారింది. లాస్ట్‌‌లో గురుకీరత్‌‌ (14 నాటౌట్‌‌), సుందర్‌‌ (10 నాటౌట్‌‌).. ఏడోవికెట్‌‌కు 16 బాల్స్‌‌లో 26 రన్స్‌‌ జోడించడంతో బెంగళూరు మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది.

సూర్యకుమార్‌‌.. కేక

టార్గెట్‌‌ చిన్నదే అయినా.. ముంబై ఓపెనర్లు డికాక్‌‌ (18), ఇషాన్‌‌ కిషన్‌‌ (25) తొందరపడ్డారు. స్టెయిన్‌‌ బాల్‌‌ను సిక్సర్‌‌గా మలిచి టచ్‌‌లో కనిపించిన ఇషాన్‌‌ ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. సేమ్‌‌ రెండోఎండ్‌‌లో నూ స్టెయిన్‌‌ బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపిన డికాక్‌‌.. ఆరో ఓవర్‌‌లో సిరాజ్‌‌ దెబ్బకు వెనుదిరిగాడు. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన చహల్‌‌ 8వ ఓవర్‌‌లో ఇషాన్‌‌ను ఔట్‌‌ చేయడంతో ముంబై 52/2 స్కోరుతో నిలిచింది. రెండు ఎండ్‌‌ల నుంచి స్పిన్నర్లను దించడంతో ముంబై రన్‌‌రేట్‌‌ తగ్గింది. దీంతో పవర్‌‌ప్లేలో 45 రన్స్‌‌ చేయగా, ఫస్ట్‌‌ టెన్‌‌లో 70కి చేరింది.  సూర్యకుమార్‌‌ నిలకడగా ఆడినా..11వ ఓవర్‌‌లో సిరాజ్‌‌.. సౌరభ్‌‌ (5)ను పెవిలియన్‌‌కు పంపాడు. ఈ టైమ్‌‌లో వచ్చిన క్రునాల్‌‌ పాండ్యా (10) ఓ మాదిరిగా ఆడినా.. సూర్యకుమార్‌‌ సిక్స్‌‌, ఫోర్లతో రెచ్చిపోయాడు. 13వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 29 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. 14వ ఓవర్‌‌లో ఓ భారీ షాట్‌‌కు యత్నించి క్రునాల్‌‌ ఔట్‌‌కావడంతో ముంబై స్కోరు 107/4గా మారింది. హార్దిక్‌‌ (17) సిక్స్‌‌తో ఖాతా తెరవగా, ఐదు ఓవర్లలో 45 రన్స్‌‌ రావడంతో ముంబై స్కోరు 117/4కు పెరిగింది. ఇక లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో 48 రన్స్‌‌ అవసరమయ్యాయి. సిరాజ్‌‌ వేసిన 16వ ఓవర్‌‌లో సూర్యకుమార్‌‌ 4, 4, 4తో 13, తర్వాతి ఓవర్‌‌లో 8 రన్స్‌‌ రావడంతో విజయసమీకరణం 18  బాల్స్‌‌లో 27గా మారింది. ఇద్దరు చెరో సిక్సర్‌‌ బాది అంతరాన్ని తగ్గించారు. ఈ దశలో హార్దిక్‌‌ ఔట్‌‌కావడంతో ఐదో వికెట్‌‌కు 51 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. 7 బాల్స్‌‌లో 7 రన్స్‌‌ అవసరం కాగా పొలార్డ్‌‌ (4 నాటౌట్‌‌), సూర్యకుమార్‌‌ చెరో ఫోర్‌‌తో విజయలాంఛనం పూర్తి చేశారు.

బెంగళూరు: ఫిలిప్పీ (స్టంప్‌‌) డికాక్‌‌ (బి) చహర్‌‌ 33, పడిక్కల్‌‌ (సి) బౌల్ట్‌‌ (బి) బుమ్రా 74, కోహ్లీ (సి) తివారి (బి) బుమ్రా 9, డివిలియర్స్‌‌ (సి) చహర్‌‌ (బి) పొలార్డ్‌‌ 15, దూబే (సి) యాదవ్‌‌ (బి) బుమ్రా 2, మోరిస్‌‌ (సి) ప్యాటిన్సన్‌‌ (బి) బౌల్ట్‌‌ 4, గురుకీరత్‌‌ (నాటౌట్‌‌) 14, సుందర్‌‌ (నాటౌట్‌‌) 10,

ఎక్స్‌‌ట్రాలు: 3

మొత్తం: 20 ఓవర్లలో 164/6

వికెట్లపతనం: 1–71, 2–95, 3–131, 4–134, 5–134, 6–138

బౌలింగ్‌‌: బౌల్ట్‌‌ 4–0–4–0, బుమ్రా 4–1–14–3, క్రునాల్‌‌ 4–0–27–0, ప్యాటిన్సన్‌‌ 3–0–35–0, రాహుల్‌‌ చహర్‌‌ 4–0–43–1, పొలార్డ్‌‌ 1–0–5–1.

ముంబై: డికాక్‌‌ (సి) గురుకీరత్‌‌ (బి) సిరాజ్‌‌ 18, ఇషాన్‌‌ (సి) మోరిస్‌‌ (బి) చహల్‌‌ 25, సూర్యకుమార్‌‌ (నాటౌట్‌‌) 79, సౌరభ్‌‌ తివారి (సి) పడిక్కల్‌‌ (బి) సిరాజ్‌‌ 5, క్రునాల్‌‌ (సి) మోరిస్‌‌ (బి) చహల్‌‌ 10, హార్దిక్‌‌ (సి) సిరాజ్‌‌ (బి) మోరిస్‌‌ 17, పొలార్డ్‌‌ (నాటౌట్‌‌) 4.

ఎక్స్‌‌ట్రాలు: 8

మొత్తం: 19.1 ఓవర్లలో 166/5

వికెట్ల పతనం: 1–37, 2–52, 3–72, 4–107, 5–158

బౌలింగ్‌‌: మోరిస్‌‌ 4–0–36–1, స్టెయిన్‌‌ 4–0–43–0, సుందర్‌‌ 4–0–20–0, సిరాజ్‌‌ 3.1–0–28–2, చహల్‌‌ 4–0–37–2.

 

FOR MORE NEWS….