ముంబై మళ్లీ మెరిసె….పంజాబ్ పై గ్రాండ్‌ విక్టరీ 

ముంబై మళ్లీ మెరిసె….పంజాబ్ పై గ్రాండ్‌ విక్టరీ 
  • రాణించిన రోహిత్‌, పొలార్డ్‌, హార్దిక్‌ సత్తా చాటిన బౌలర్లు

ముంబై మళ్లీ మెరిసింది. బెంగళూరుతో గత మ్యాచ్‌‌లో సూపర్‌‌‌‌ఓవర్లో విజయాన్ని చేజార్చుకున్న ఆ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది.  హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) కెప్టెన్‌‌ఇన్నింగ్స్‌‌, పొలార్డ్‌‌(20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 నాటౌట్‌‌), హార్దిక్‌‌ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌‌) ధనాధన్‌‌ మెరుపులకు తోడు బౌలర్లూ సత్తా చాటడంతో పంజాబ్‌‌ను చిత్తు చేసిన ముంబై లీగ్‌‌లో  రెండో విక్టరీ ఖాతాలో వేసుకుంది.  మరోవైపు స్లాగ్‌‌ ఓవర్లలో చెత్త బౌలింగ్‌‌లో ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్న పంజాబ్‌‌ బ్యాటింగ్‌‌లో పూర్తిగా విఫలమై మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది.

అబుదాబి: డిఫెండింగ్‌‌ చాంప్ ముంబై  ఇండియన్స్​ చాంపి యన్ ఆటతో అదరగొట్టింది. ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో  పటిష్ట కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ పని పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌‌లో  48 పరుగుల తేడాతో  పంజాబ్‌‌పై  గ్రాండ్‌‌ విక్టరీ కొట్టింది. టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌ చేసిన ముంబై.. రోహిత్‌‌, పొలార్డ్‌‌, హార్దిక్‌‌ మెరుపులతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  ఇండియన్స్‌‌ బౌలింగ్‌‌ ధాటికి  కింగ్స్‌‌ ఎలెవన్‌‌20 ఓవర్లలో 8 వికెట్లకు 143  రన్సే చేసి చిత్తుగా ఓడింది. నికోలస్‌‌ పూరన్‌‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) టాప్‌‌ స్కోరర్‌‌‌‌. ముంబై బౌలర్లలో బుమ్రా ( 2/18 ), ప్యాటిన్సన్‌‌ (2/28), రాహుల్‌‌ చహర్ (2/26) అదరగొట్టారు.   పొలార్డ్​కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

రోహిత్‌‌‌‌ నిలకడ.. పొలార్డ్‌‌‌‌, పాండ్యా ధనాధన్‌‌‌‌

ముంబై ఇన్నింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌  స్కోరర్‌‌‌‌‌‌‌‌  రోహితే అయినా అసలైన హీరోలు పొలార్డ్‌‌‌‌, హార్దిక్‌‌‌‌లే. పడుతూ లేస్తూ సాగిన ఇన్నింగ్స్‌‌‌‌ను రోహిత్‌‌‌‌  నడిపిస్తే  ఆఖర్లో  విధ్వంసం సృష్టించిన పొలార్డ్‌‌‌‌, పాండ్యా భారీ స్కోరు అందించారు. తొలుత టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆ టీమ్‌‌‌‌కు ఆరంభంలోనే షాక్‌‌‌‌ తగిలింది. ఇన్నింగ్స్‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌ ‌‌‌‌ డికాక్‌‌‌‌ (0) డకౌటయ్యాడు. కాట్రెల్‌‌‌‌(1/20) మిడిల్‌‌‌‌, లెగ్‌‌‌‌ స్టంప్‌‌‌‌పై వేసిన బాల్‌‌‌‌  లేట్‌‌‌‌ స్వింగ్‌‌‌‌అయి వికెట్లను గిరాటేసింది. షమీ (1/36)వేసిన సెకండ్‌‌‌‌ ఓవర్లో  రెండు ఫోర్లు కొట్టిన రోహిత్‌‌‌‌ కూడా వెనుదిరగాల్సింది. లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు అతను ఎల్బీ అయినా రివ్యూలో  లైన్‌‌‌‌ మిస్సయినట్టు తేలడంతో బతికిపోయాడు. కాట్రెల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు బౌండ్రీలతో జోరు చూపిన సూర్యకుమార్‌‌‌‌ (10) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. నాలుగో ఓవర్లో  సింగిల్‌‌‌‌ తీసే ప్రయత్నంలో షమీ వేసిన డైరెక్ట్‌‌‌‌ త్రోకు రనౌటయ్యాడు. క్రీజులో కుదురుకున్న రోహిత్‌‌‌‌.. కృష్ణప్ప గౌతమ్‌‌‌‌ (1/45) బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లు రాబట్టడంతో  పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో ముంబై 41/2తో నిలిచింది. ఫీల్డింగ్‌‌‌‌ మార్పులు జరిగిన తర్వాత స్పిన్నర్లు రవి బిష్నోయ్‌‌‌‌ (0/37), గౌతమ్‌‌‌‌  పొదుపుగా బౌలింగ్‌‌‌‌చేసి ముంబైపై ఒత్తిడి పెంచారు. ఓవైపు రోహిత్‌‌‌‌ క్రమం తప్పకుండా షాట్లు కొడుతున్నా యంగ్‌‌‌‌ బ్యాట్స్​మన్‌‌‌‌ ఇషాన్‌‌‌‌  కిషన్‌‌‌‌ ( 32 బంతుల్లో 28) స్లోగా బ్యాటింగ్‌‌‌‌ చేయడంతో తొలి 10 ఓవర్లలో ముంబై 62/2తో  సరిపెట్టుకుంది. బిష్నోయ్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లో  సిక్సర్‌‌‌‌ ‌‌‌‌కొట్టిన ఇషాన్‌‌‌‌ గేరు మార్చే ప్రయత్నం చేశాడు. నీషమ్‌‌‌‌ (0/52) బౌలింగ్‌‌‌‌లో అతనిచ్చిన ఈజీ క్యాచ్‌‌‌‌ను డీప్‌‌‌‌ మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌లో బిష్నోయ్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేశాడు. కానీ ఈ లైఫ్‌‌‌‌ను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గౌతమ్‌‌‌‌ వేసిన 14వ ఓవర్లో స్లాగ్‌‌‌‌ స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌ ఆడి నాయర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో ముంబై 83/3తో నిలిచింది. ఈ లెక్కన రోహిత్‌‌‌‌సేన 160 రన్స్‌‌‌‌ చేస్తే గొప్పే అనిపించింది.

పంజా విసరలేదు..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో పంజాబ్‌‌ తడబడింది.  పవర్‌‌‌‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆ టీమ్‌‌ ఏ దశలోనూ ముంబైకి పోటీ ఇవ్వలేకపోయింది.  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్  మయాంక్‌‌ అగర్వాల్‌‌ (18 బంతుల్లో 25) మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. కానీ, ఫస్ట్‌‌స్పెల్‌‌లో అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన బుమ్రా ఐదో ఓవర్లో క్లాసిక్‌‌ డెలివరీతో అతడిని క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేసి  ముంబైకి బ్రేక్‌‌ ఇచ్చాడు. నెక్ట్స్‌‌ఓవర్లోనే కరుణ్​ నాయర్‌‌‌‌(0)ను క్రునాల్‌‌ డకౌట్‌‌చేయడంతో పంజాబ్‌‌కు డబుల్‌‌ షాక్‌‌ తగిలింది. వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో కెప్టెన్‌‌ రాహుల్‌‌ (19 బంతుల్లో 1 ఫోర్‌‌‌‌తో 17) వికెట్‌‌కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే, యువ స్పిన్నర్‌‌‌‌ రాహుల్‌‌ చహర్‌‌  వేసిన తొమ్మిదో ఓవర్లో ప్యాడిల్‌‌ స్వీప్‌‌ ఆడే ప్రయత్నంలో అతనూ బౌల్డ్‌‌ అవడంతో పంజాబ్‌‌60/3తో డీలా పడింది. దాంతో జట్టును గెలిపించే బాధ్యత పూరన్‌‌, మ్యాక్స్​వెల్‌‌ (11)పై పడింది. అప్పటికే క్రునాల్‌‌ బౌలింగ్‌‌లో 6,4తో టచ్‌‌లోకి వచ్చిన పూరన్‌‌ ధాటిగా బ్యాటింగ్‌‌ చేశాడు. మరో ఎండ్‌‌లో మ్యాక్సీ కుదురుకునేందుకు టైమ్‌‌ తీసుకున్నా… కరీబియన్‌‌ ప్లేయర్‌‌ మాత్రం ‌‌ఓవర్‌‌‌‌కో బౌండ్రీ కొడుతూ స్కోరు వంద దాటించాడు. అయితే, హాఫ్‌‌ సెంచరీకి చేరువైన అతడిని 14వ ఓవర్లో  కాట్‌‌బి హైండ్‌‌ చేసిన ప్యాటిన్సన్‌‌ మ్యాచ్‌‌ను తమవైపు లాగేసుకున్నాడు. ఆ వెంటనే రాహుల్‌‌ చహర్‌‌ ‌‌ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా వేసిన టర్నింగ్‌‌ బాల్‌‌ను అక్రాస్‌‌ ద లైన్‌‌ ఆడిన మ్యాక్సీ… మిడాన్‌‌లో బౌల్ట్‌‌కు క్యాచ్‌‌ఇవ్వడంతో పంజాబ్‌‌ ఓటమి ఖాయమైంది.   నీషమ్‌‌(7), సర్ఫ్‌‌రాజ్‌‌(7), రవి బిష్నోయ్‌‌(1) పెవిలియన్‌‌కు క్యూ కట్టడంతో పంజాబ్‌‌కు ఘోర ఓటమి
తప్పలేదు.

ఓవర్లలో104 రన్స్‌‌

అనూహ్యంగా జోరు పెంచిన ముంబై చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 104 పరుగులు రాబట్టింది. రవి బిష్నోయ్‌‌ వేసిన 15వ ఓవర్లో పొలార్డ్‌‌, రోహిత్‌‌  చెరో సిక్సర్‌‌ ‌‌బాదడంతో స్కోరు 100 దాటింది. ఆపై నీషమ్‌‌ బౌలింగ్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ 4, 6, 6తో రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 22 రన్స్‌‌  రావడంతో రన్‌‌రేట్‌‌అమాంతం పెరిగింది. తర్వాతి ఓవర్లో మరో షాట్‌‌ ఆడే ప్రయత్నంలో రోహిత్‌‌ ఔటయ్యాడు. లాఫ్టెడ్‌‌ షాట్‌‌తో లాంగాన్‌‌ మీదుగా సిక్సర్‌‌‌‌  కొట్టే ప్రయత్నం చేయగా.. బౌండ్రీలైన్‌‌ వద్ద మ్యాక్స్‌‌వెల్‌‌ క్యాచ్‌‌  అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్‌‌ తప్పి లైన్‌‌ బయటకు వెళ్లే ముందు పక్కనే ఉన్న నీషమ్‌‌కు బంతిని అందించడంతో హిట్‌‌మ్యాన్‌‌ ఇన్నింగ్స్​కు తెరపడింది. అయినా హార్డ్‌‌ హిట్టర్స్‌‌ పొలార్డ్, హార్దిక్.. పంజాబ్‌‌  బౌలర్లపై ఓ రేంజ్‌‌లో విరుచుకుపడ్డారు. వచ్చిన బాల్‌‌ను వచ్చినట్టు స్టాండ్స్‌‌కు పంపుతూ సిక్సర్ల వర్షం కురిపించారు. నీషమ్‌‌ వేసిన 18వ ఓవర్లో హార్దిక్‌‌ 6, 4, 4 కొట్టగా..  షమీ బౌలింగ్‌‌లో పొలార్డ్‌‌  హ్యాట్రిక్  ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో 19 రన్స్‌‌వచ్చాయి.  స్పిన్నర్‌‌‌‌ గౌతమ్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో పాండ్యా ఒక సిక్స్‌‌  సాధించగా, పొలార్డ్‌‌ చివరి మూడు బాల్స్‌‌ను సిక్సర్లుగా మలిచి ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చాడు. ఆ ఓవర్లో 25 రన్స్‌‌ రావడంతో ముంబై స్కోరు 190 దాటింది.

స్కోరు బోర్డ్‌‌

ముంబై: డికాక్‌‌(బి) కాట్రెల్‌‌0, రోహిత్ (సి) నీషమ్‌‌(బి) షమీ 70, సూర్యకుమార్‌‌‌‌ (రనౌట్‌‌/షమీ) 10, ఇషాన్‌‌(సి) నాయర్‌‌‌‌(బి) గౌతమ్‌‌28, పొలార్డ్‌‌(నాటౌట్‌‌) 47, హార్దిక్‌‌ (నాటౌట్‌‌)30; ఎక్స్​ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 191/4; వికెట్ల పతనం: 1–0, 2–21, 3–83, 4–124; బౌలింగ్: కాట్రెల్‌‌4–1–20–1, షమీ 4–0–36–1, బిష్నోయ్‌‌4–0–37–0, గౌతమ్‌‌4–0–45–1, నీషమ్‌‌4–0–52–0.

పంజాబ్‌‌: రాహుల్‌‌(బి) చహర్‌‌‌‌17, మయాంక్‌‌ (బి) బుమ్రా 25, కరుణ్‌‌(బి) క్రునాల్‌‌0, పూరన్‌‌ (సి) డికాక్‌‌(బి)ప్యాటిన్సన్‌‌44, మ్యాక్స్​ వెల్‌‌  (సి)  బౌల్ట్‌‌‌‌(బి) చహర్‌‌‌‌11, నీషమ్‌‌(సి) సూర్యకుమార్‌‌(బి) బుమ్రా 7, సర్ఫ్‌‌రాజ్‌‌(ఎల్బీ) ప్యాటిన్సన్‌‌7, గౌతమ్‌‌(నాటౌట్) 22, బిష్నోయ్‌‌(సి) సూర్యకుమార్‌‌(బి) బౌల్ట్‌‌1, షమీ (నాటౌట్‌‌) 2; ఎక్స్​ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1–38, 2–39, 3–60, 4–101, 5––107, 6–112, 7–121, 8–124; బౌలింగ్‌‌: ట్రెంట్‌‌బౌల్ట్‌‌4–0–42–1, ప్యాటిన్సన్‌‌4–0–28–2, క్రునాల్‌‌4–0–27–1, బుమ్రా  4–0–18–2, చహర్‌‌‌‌4–0–26–2.

రోహిత్‌ @ 5000
ఐపీఎల్‌ లో రోహిత్‌ శర్మ 5 వేల రన్స్‌ క్లబ్‌ లో చేరాడు. షమీ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌ కొట్టిన అతను ఈ మార్కు దాటాడు. ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌ గా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ (5430), సురేశ్‌ రైనా (5368) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.