ట్రేడ్ రూమర్స్‌కి ముంబై ఇండియన్స్ చెక్: హార్దిక్ పాండ్యాపై క్రేజీ పోస్ట్.. ఐపీఎల్ 2027లో రీటెన్షన్ కన్ఫర్మ్!

ట్రేడ్ రూమర్స్‌కి ముంబై ఇండియన్స్ చెక్: హార్దిక్ పాండ్యాపై క్రేజీ పోస్ట్.. ఐపీఎల్ 2027లో రీటెన్షన్ కన్ఫర్మ్!

Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీమ్ మారబోతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్దెత్తున్న వస్తున్న రూమర్స్‌కి ముంబై మేనేజ్‌మెంట్ గట్టిగానే చెక్ పెట్టింది. రీసెంట్‌గా ముంబై తమ అధికారిక హ్యాండిల్‌లో "Memo: Make it HP coded" అనే క్యాప్షన్‌తో హార్దిక్ పాండ్యా ఫోటోలను షేర్ చేసింది. ఇతర ఫ్రాంచైజీలు హార్దిక్‌ను ట్రేడ్ చేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాయనే ప్రచారం నడుస్తున్న టైమ్‌లో, ముంబై ఇండియన్స్ చేసిన ఈ వైరల్ పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో హార్దిక్‌ను ముంబై రీటైన్ చేసుకోవడం పక్కా అని తేలిపోయింది.

పాండ్యా కోసం పోటీ పడ్డ రేస్ టీమ్స్: 

గడిచిన కొన్ని నెలలుగాహార్దిక్ పాండ్యా కోసం ఐపీఎల్ బిగ్ ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయాసపడినట్లు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హార్దిక్ కోసం ట్రై చేసినా, రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఒప్పుకోకపోవడంతో ఆ డీల్ క్యాన్సిల్ అయింది. మరోవైపు అజింక్య రహానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొత్త కెప్టెన్ కోసం పాండ్యాపై కన్నేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్ కోసం ఇంట్రెస్ట్ చూపించినా, ముంబై ఇండియన్స్ మాత్రం తమ కెప్టెన్‌ను వేరే టీమ్‌కి ఇచ్చేదే లేదని క్లియర్‌గా తేల్చేసింది.

ఫేక్ రూమర్స్ అని తేల్చేసిన మేనేజ్‌మెంట్: 

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆఫీషియల్స్ స్పందిస్తూ, ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని ముందే స్పష్టం చేశారు. తమ అంతర్గత రివ్యూ ప్రాసెస్ మాత్రమే నడుస్తోందని, ట్రేడ్ వార్తలన్నీ కేవలం కల్పిత కథనాలేనని కొట్టిపారేసిశారు. ఇప్పుడు ఐపీఎల్ 2027 కోసం కూడా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే ముంబై జట్టు బరిలోకి దిగబోతోందని ఈ పోస్ట్‌ ద్వారా కన్‌ఫర్మేషన్ వచ్చేసింది.

►ALSO READ | ISL‌కు భారీ షాక్.. రూ. 55 లక్షల ఫీజు చెల్లించని డైమండ్ హార్బర్.. 13 జట్లతోనే టోర్నీ!

మరో ఛాన్స్ ఇవ్వనున్న ముంబై ఇండియన్స్: 

2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయినప్పటికీ, అతని ఆల్ రౌండ్ కేపబిలిటీస్, లీడర్‌షిప్ స్కిల్స్‌పై మేనేజ్‌మెంట్ ఫుల్ ట్రస్ట్ ఉంచింది. వచ్చే సీజన్ నాటికి మరింత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి, ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలనే పట్టుదలతో ముంబై ఫ్రాంచైజీ ఉంది. మరి ఐపీఎల్ 2027లో హార్దిక్  పాండ్యా ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలబెడతాడో లేదో అనేది వేచి చూడాల్సి ఉంది.