ISL‌కు భారీ షాక్.. రూ. 55 లక్షల ఫీజు చెల్లించని డైమండ్ హార్బర్.. 13 జట్లతోనే టోర్నీ!

ISL‌కు భారీ షాక్.. రూ. 55 లక్షల ఫీజు చెల్లించని డైమండ్ హార్బర్.. 13 జట్లతోనే టోర్నీ!

ISL 2026 Kick Off Delayed: ఇండియన్ సూపర్ లీగ్ (ISL) కొత్త సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఏఐఎఫ్‌ఎఫ్ (AIFF) బిగ్ షాక్ ఇచ్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీ నుంచే ప్రారంభం కావాల్సిన ఈ డొమెస్టిక్ లీగ్, ఇప్పుడు ఏకంగా నెల రోజులకు పైగా వాయిదా పడింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6 వరకు జరిగే ఫిఫా ఇంటర్నేషనల్ విండో మ్యాచ్‌ల తర్వాతే, అంటే అక్టోబర్ 6వ తేదీ తర్వాతే ఈ లీగ్ స్టార్ట్ కానుందని ఏఐఎఫ్‌ఎఫ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది.

13 టీమ్స్ తోనే ఐఎస్ఎల్‌: 

ఈసారి లీగ్‌లో టీమ్‌ల లెక్కలు కూడా కంప్లీట్ రివర్స్ అయ్యాయి. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచి లీగ్‌లోకి అడుగు పెట్టిన డైమండ్ హార్బర్ ఎఫ్‌సీ పార్టిసీపేషన్ ఫీజు రెండో విడత రూ. 55 లక్షలు డెడ్‌లైన్ లోపు కట్టలేకపోవడంతో టోర్నమెంట్ నుంచి ఔట్ అయింది. మరోవైపు జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ తప్పుకోవడంతో, వాళ్ల స్టేక్‌ను కొనుగోలు చేసి రూ. 1.1 కోట్ల ఫీజు మొత్తం చెల్లించిన చర్చిల్ బ్రదర్స్ లీగ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ లీగ్‌లో మొత్తం 13 జట్లు మాత్రమే పోటీ పడబోతున్నాయి.

కోల్‌కతాలో బ్రెజిల్‌తో బ్లాక్‌బస్టర్ ఫైట్: 

ఫిఫా ఆసియాన్ కప్ 2026 నుంచి ఇండియా తప్పుకోవడంపై నడుస్తున్న రచ్చకు ఏఐఎఫ్‌ఎఫ్ క్లారిటీ ఇచ్చింది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన దిగ్గజ బ్రెజిల్ జట్టుతో అక్టోబర్ 3న కోల్‌కతా వేదికగా జరగబోయే బిగ్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌కే తాము మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే అతి పెద్ద అవకాశంగా నిలిచే ఈ డ్రీమ్ మ్యాచ్, మన నేషనల్ టీమ్ కాన్ఫిడెన్స్‌ను పెంచడమే కాకుండా ఫ్యాన్స్‌కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.

►ALSO READ | చెస్లో భారత్కు డబుల్‌‌ జోష్‌‌.. సింక్ఫీల్డ్‌‌ కప్లో అగ్రస్థానానికి ప్రజ్ఞానంద

ఫేక్ రూమర్స్‌పై ఏఐఎఫ్‌ఎఫ్ సీరియస్: 

ఏషియన్ కప్ నుంచి తప్పుకోవడంతో ఇండియాకు భారీ ఫైన్ పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌ను, నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఏఐఎఫ్‌ఎఫ్ తీవ్రంగా ఖండించింది. నిరూపణ లేని లెక్కలతో ఇండియన్ ఫుట్‌బాల్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తే సహించేది లేదని, ఇలాంటి కల్పిత వార్తలు ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఏఐఎఫ్‌ఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ ఇండియన్ ఫుట్‌బాల్ భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేసింది.