
భారీ హిట్టర్లతో కూడిన రెండు టాప్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ పోరాటంలో..ముంబై ఇండియన్స్ హిట్టయ్యిం ది..! ‘ హిట్ మ్యాన్ ’రోహిత్ శర్మ (54 బాల్స్ లో 80, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (28 బాల్స్ లో 47, 6 ఫోర్లు, 1 సిక్స్ ) పరుగుల వేటలో సూపర్ హిట్టయ్ యారు..! ఫలితంగా అరబ్ గడ్డపై ఓటముల రికార్డుకు చెక్ పెట్టిన ముంబై.. ఎట్టకేలకు మెగా లీగ్ లో బోణీ చేసింది..! నైట్ రైడర్స్ హార్డ్ హిట్టర్లందరూ ప్రత్యర్థి బౌలర్ల ముందు దూది పింజల్లా తేలిపోవడంతో.. టార్గెట్ ఛేజింగ్ లో కోల్‌కతా చతికిలపడింది..! ఓవరాల్‌గా ఊహించినంత పోటీ ఇవ్వలేకపోయిన కేకేఆర్ .. రాబోయే మ్యాచ్ ల్లో ఎలా ఆడుతుందో చూడాలి..!!
స్లో స్టార్టర్స్ గా పేరున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గాడిలో పడింది. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతూ.. తమ రెండో మ్యాచ్ లో స్థాయికి తగిన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. దీంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 49 రన్స్ తేడాతో కోల్ కతాపై గెలిచి లీగ్ లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 రన్స్ చేసింది. తర్వాత కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 రన్స్ కే పరిమితమైంది. కెప్టెన్ కార్తీక్ (23 బాల్స్ లో 30, 5 ఫోర్లు), కమిన్స్ (12 బాల్స్ లో 33, 1 ఫోర్, 4 సిక్సర్లు ) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు. రోహిత్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది.
హిట్ మ్యాన్ .. సూర్యకుమార్ ఫస్ట్ ఓవర్‌లో రోహిత్ సిక్స్ తో మొదలైన ముంబై ఇన్నింగ్ స్ కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్ (1) ఫుల్ షాట్ ఆడే క్రమంలో మిడ్ వికెట్ లో నాయక్ చేతికి చిక్కాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ కూడా ఎక్కడా తగ్గలేదు.మూడో ఓవర్‌లో 4, 4, 4, 4తో 16 రన్స్ పిండుకున్నాడు. కమిన్స్ వేసిన ఐదో ఓవర్‌లో రోహిత్ ..మిడ్ వికెట్ లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో జోష్ పెరిగింది. ఆరో ఓవర్‌లో స్పిన్నర్ నరైన్ (1/22)ను వచ్చినా రెండు ఫోర్లు ఇచ్చుకున్నాడు. దీంతో పవర్‌ప్లే లో ముంబై 59/1 స్కోరు చేసింది. పరుగులు కట్టడి చేయాలనే ఉద్దేశంతో డీకే.. రసెల్ (7వ ఓవర్)ను దించినా.. రోహిత్ 6,4తో రెచ్ చిపోయాడు. ఆ వెంటనే కుల్దీప్ కు బాల్ ఇచ్చినా.. సూర్యకుమార్ సిక్స్ తో 11 రన్స్ రాబట్టాడు. అయితే 9, 10 ఓవర్లలో నరైన్, కుల్దీప్ చెరో 5,6 రన్స్ ఇవ్వడంతో.. ఫస్ట్ టెన్ ఓవర్స్ లో ముంబై స్కోరు 94/1కు చేరింది. అయితే 11వ ఓవర్‌లో సూర్యకుమార్ అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో రెండో వికెట్ కు 90 రన్స్ పార్ట్‌నర్‌షిప్ కు బ్రేక్ పడింది. 39 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. 14వ ఓవర్ (కుల్దీప్ )లో మిడ్ వికెట్ , లాంగాన్‌లో మరో రెండు సిక్సర్లు కొట్టాడు.కొత్తగా వచ్చిన సౌరభ్ తివారీ (13 బాల్స్ లో 21, 1ఫోర్, 1 సిక్స్ ) 4, 6తో టచ్ లో కనిపించినా.. 16వ ఓవర్‌లో నరైన్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. మూడో వికెట్ కు 49 రన్స్ జతకావడంతో ముంబై స్కోరు 150కి చేరింది.
కార్తీక్ , కమిన్స్ మినహా..
196 రన్స్ ఛేజింగ్ లో కోల్ కతాకు సరైన ఆరంభం దక్కలేదు. బౌల్ట్ (2/30), ప్యాటిన్సన్ (2/25) కట్టుదిట్టం గా బౌలింగ్ చేయడంతో.. భారీ ఆశలు పెట్టుకున్న శుభ్ మన్ గిల్ (7), హిట్టర్ నరైన్ (9) హిట్టింగ్ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో 25 రన్స్ కే రెండు 2 వికెట్లు పడటంతో నైట్ రైడర్స్ ఎదురీత మొదలైంది. కెప్టెన్ దినేశ్ తో జత కలిసిన నితీష్ రాణా (24).. రాహుల్ చహర్ (2/26)..బౌలింగ్ లో సిక్సర్ బాదడంతో తొలి 6 ఓవర్లలో కేకేఆర్ 33/2 స్కోరు చేసింది. పవర్‌ప్లే ను విజయవంతంగా వాడుకున్న ముంబై.. ఆ తర్వాతకాస్త గాడి తప్పింది. ఏడో ఓవర్‌లో పొలార్డ్ 8 రన్స్ ఇస్తే, తర్వాతి ఓవర్‌లో చహర్ 4, 4తో 13 రన్స్ సమర్పించుకున్నా డు. చహర్ ప్లేస్ లో క్రునాల్ ను తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. కార్తీక్ , రాణా చెరో ఫోర్ కొట్టడంతో తొలి పది ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 2 వికెట్లకు 71 రన్స్ చేసింది. ఇకఈ జోడీ గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో వరుస ఓవర్లలో నైట్ రైడర్స్ కు ఎదురుదెబ్బలుతగిలాయి. ముందుగా 11వ ఓవర్‌లో చహర్ ..కార్తీక్ ను ఎల్బీ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే నితీష్ ఇచ్చిన క్యాచ్ ను రన్నింగ్ లో హార్దిక్ అద్భుతంగా అందుకున్నాడు. ఫలితంగా మూడో వికెట్ కు 46 రన్స్ పార్ట్‌నర్‌షిప్ కు తెరపడటంతో పాటు కేకేఆర్ స్కోరు 77/4గా మారింది. 11.5వ ఓవర్‌లో మోర్గాన్ (16)తో కలిసిన రసెల్ (11) ఘోరంగా నిరా శపర్చాడు. 13వ ఓవర్‌లో బుమ్రా బాల్ వికెట్లను తాకినా బెయిల్స్ పడకపోవడంతో మోర్గాన్ బతికిపోయాడు. కానీ ఈ ఇద్దరు సింగిల్స్ , డబుల్స్ కే పరిమితం కావడంతో చేయాల్సి న రన్‌రేట్ పెరిగింది. 4వ ఓవర్‌లో మోర్గాన్.. ఓ సిక్సర్, తర్వాతి ఓవర్‌లో రసెల్ రెండు ఫోర్లు కొట్టడంతో 15 ఓవర్లలో కోల్ కతా 100కు చేరింది. లాస్ట్ 5 ఓవర్లలో 96 రన్స్ కావాల్సి దశలో 16వ ఓవర్‌లో బుమ్రా (2/32).. డబుల్ ఝలక్ ఇచ్చాడు. నాలుగు బాల్స్ తేడాలో రసెల్ , మోర్గాన్‌ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే నాయక్ (1) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో వచ్చిన కమిన్స్ బుమ్రా (18వ) 27 రన్స్ రాబట్టా డు. దీంతో విజయసమీకరణం 12 బాల్స్ లో 57గా మారింది. 19వ ఓవర్‌లో భారీ షాట్ కు ప్రయత్నించి కమిన్స్ ఔట్ కావడంతో కోల్ కతా గెలుపు రేస్ లో వెనుకబడింది.