తలలో కత్తి దిగినా ఫోన్ మాట్లాడుతూ... వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే

తలలో కత్తి దిగినా ఫోన్ మాట్లాడుతూ... వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే

తలలో కత్తి దిగినా మృత్యువుతో పోరాడుతూ ఫోన్ చూస్తున్న ఓ  యువకుడి వీడియో  సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. అంతటి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వైద్యులు వెంటనే ఎందుకు స్పందించలేదని, ఫోన్ ఎలా మాట్లాడనిచ్చారని ప్రశ్నించారు.

 అయితే  ముంబై పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం వెల్లడించారు. ? ముంబైలోని మాంఖుర్డ్ పీఎంజీపీ కాలనీలో మే 1వ తేదీ రాత్రి రోహిత్ నాగ్నాథ్ పవార్ అనే వ్యక్తిపై పాత కక్షలతో కొందరు దుండగులు వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో ఒక పదునైన ఆయుధం రోహిత్ పుర్రెలోకి బలంగా దిగిపోయింది ఆ స్థితిలో కూడా రోహిత్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ కేసులో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని డోంగ్రీ రిమాండ్ హోమ్‌కు తరలించామని తెలిపారు. 

►ALSO READ | ఇదేం గాలి దుమారం బాబోయ్.. దెబ్బకి గాల్లోకి లేచాడు.. యూపీలో 89 మందిని పొట్టనపెట్టుకున్న తుఫాను !

ప్రస్తుతం రోహిత్ ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసి అతని తలలో ఉన్న ఆయుధాన్ని తొలగించారు. రోహిత్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని అందరూ చర్చించుకుంటున్నారు.