ముంబై మేయర్ పదవి జనరల్ మహిళకు..ఓబీసీ మహిళకు ఇవ్వలేదని ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

ముంబై మేయర్ పదవి జనరల్ మహిళకు..ఓబీసీ మహిళకు ఇవ్వలేదని ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

ముంబై: ముంబై మేయర్ పదవి ‘జనరల్ మహిళ’ కేటగిరీకి రిజర్వ్ అయింది. ఇందుకోసం గురువారం లాటరీ నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. 

దీంతో  తీవ్ర గందరగోళం నెలకొంది. ఇందుకు నిరసనగా శివసేన (యూబీటీ) వాకౌట్ చేసింది. ఆ పార్టీ నేత, మాజీ మేయర్ కిశోరి పెడ్నేకర్ మాట్లాడుతూ.. ముంబైలో ఓబీసీలు ఎక్కువగా ఉన్నా.. లాటరీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ పేర్లు పెట్టలేదన్నారు. 

బీఎంసీ మేయర్ పదవి గత రెండు పర్యాయాలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలోనే ఉందన్నారు. రాష్ట్ర మంత్రి ఒకరు దీనిపై స్పందిస్తూ.. ఈ అభ్యంతరాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. 

కాగా,  పూణే, నాసిక్, నాగపూర్, నవీ ముంబై, మీరా భయందర్, మాలేగాం, ధూలే, నాందేడ్ మేయర్ పదవులూ మహిళలకు రిజర్వ్ అయ్యాయి.