మేం ఓట్లేస్తాం: టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంపై మహిళల ధర్నా

మేం ఓట్లేస్తాం: టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంపై మహిళల ధర్నా

రాష్ట్ర ఐటీ మంత్రి ఇలాకాలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఓటు వేసి తమకు కావాల్సిన వారిని గెలిపించుకుంటామంటూ కలెక్టర్ ఆఫీస్ ఎదుట దర్నాకు దిగారు పలువురు మహిళా ఓటర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డును టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దర్నాం అరుణ లక్ష్మీనారాయణను ఏకగ్రీవం చెయ్యడంపై స్థానిక ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట న్యాయపోరాటానికి దిగారు.

స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముడుపోయారని అన్నారు మహిళా ఓటర్లు. తమ ఓట్లను అమ్మకానికి పెట్టేశారని, తాము బతికి ఉండగానే స్వతంత్ర అభ్యర్థులు చంపేశారంటూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, వెంటనే తమకు ఓటు హక్కును కల్పించాలని 5వ వార్డు ఓటర్లు డిమాండ్ చేశారు.

More News:

కుట్రలు సహించం: నిరసన పేరుతో ఆజాదీ అంటే దేశ ద్రోహమే

మహిళలు టార్గెట్‌గా సైబర్ నేరాలు