
మధ్యప్రదేశ్లోని మునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా యూనిట్లో మెషినిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.
పోస్టుల సంఖ్య: 50
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐతోపాటు ఏదైనా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రేడ్ అప్రెంటీస్లో శిక్షణ పొంది ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా. చిరునామా ది చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా, జబల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్.
సెలెక్షన్ ప్రాసెస్: ట్రేడ్ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్, ఎన్ సీవీటీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.