పంజాగుట్ట, వెలుగు: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఒక వ్యక్తిని హత్య చేశారు. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన శంకర్(48)ని బుధవారం ఉదయం భరత్ నగర్ వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు. మృతుడు రెండేళ్లుగా మూసాపేటలోని ఒక హోటల్‌లో హెడ్ కుక్‌గా పని చేస్తున్నాడు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
