చాలామంది కండరాలు పెంచడం కోసం జిమ్‌కి వెళ్తుంటారు. బరువైన డంబెల్స్ ఎత్తుతుంటారు. అయితే జిమ్‌కి వెళ్లగానే ముందు బరువులు ఎత్తితే బాడీ పెయిన్స్ వస్తాయి. కడుపులో నరాలు బిగుసుకుపోతాయి. అయితే డంబెల్ ఎత్తాల్సిన పనిలేకుండా, ఎక్సర్‌సైజ్ చేసి కూడా కండరాలు పెంచొచ్చు. అందుకు చేయాల్సిన ఎక్సర్‌పైజ్‌లు ఇవి...
- వాకింగ్ ప్లాంక్ చేయడం ద్వారా శరీరం దృఢంగా తయారవుతుంది. ఇదెలా చేయాలంటే, బోర్లా పడుకొని ప్లాంక్ పొజిషన్‌లోకి రావాలి. తరువాత రెండు చేతులతో పైకి లేచి పుషప్ పొజిషన్‌లోకి రావాలి. ఇలా చేతులతో పొజిషన్స్ మారుస్తూ వాకింగ్ ప్లాంక్ చేయాలి.
- ఛాతి, భుజాలు గట్టిపడటానికి మోకాలు ఫుషప్ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఈ ఎక్సర్‌సైజ్‌ను ఫొటోలో చూపినట్టు చేయాలి. అంటే ముందు బోర్లా పడుకొని పాదాలను పైకెత్తాలి. మోకాళ్లు, చేతులతో పైకి లేచి పుషప్ చేస్తూ చేయాలి.
- సైడ్ ప్లాంక్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల చేతులు, భుజాల్లో కండ పెరుగుతుంది. ఫొటోలో చూపెట్టినట్టు ఈ ఎక్సర్‌సైజ్ చేయాలి. అంటే ముందు కుడి పక్కకు పడుకొని కుడి మోచేతిపై పైకి లేస్తూ ఎడమచేతిని నడుముపై పెట్టాలి. తరువాత నడుమును భూమికి ఆన్చి పైకి, కిందికి లేవాలి. ఇలానే ఎడమ పక్క కూడా చేయాలి.
